మన తెలంగాణ/హైదరాబాద్ : రాయదుర్గం భూములపై హైకోర్టు స్టే ఇచ్చింది. 3 వా రాలు పాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఒప్పందం, కౌంటర్ దాఖలు చేయాలనే ని ఎస్బిఐఐసి, గౌర వెంచర్స్‌కు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ రాయదుర్గంలోని సర్వే నంబర్ 83/1లోని భూమికి టిజిఐఐసి ఇటీవల వేలం నిర్వహించింది. ఈ ధర ఎకరాకు రూ.237 కోట్ల చొప్పున గౌర వెంచర్స్ కొనుగోలు చేసింది. అయితే, ఆ భూమిలో 5 ఏ కరాలు తమదేనంటూ హైకోర్టును ఎస్బిఐ బ్యాంక్ ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. సర్వే నంబర్ 83/1లోని 5 ఎ కరాల భూమి తిరిగి ఇప్పించాలని కోరారు. గురువారం విచారణ జరిపిన ధర్మాసనం రాయదుర్గం భూములపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
రంగారెడ్డి జిల్లా రాయదుర్గం పాన్మక్త పరిధిలోని సర్వే నంబర్ 83/1లో గల ఈ భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టిజిఐసి) ఈ -వేలం ద్వారా విక్రయించడాన్ని సవాలు చే స్తూ ఎస్బిఐ 2 రిట్ పిటిషన్లు దాఖలు చేశాయి. మే 6న ఇచ్చిన వేలం నోటిఫికేషన్‌తో పాటు మే 28న జరిగిన వేలం ప్రక్రియ, విక్రయాన్ని రద్దు చేయాలని బ్యాంకు కోరింది. పిటిషన్ వివరాల ప్రకారం ఉమ్మడి ఎపి ప్రభుత్వం 2010లో రూ.13.33 కోట్లకు ఈ భూమిని ఎస్బిహెచ్కి కేటాయించింది. 2011లో ఒప్పందం కుదిరి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌బిహెచ్, ఎస్బిఐలో విలీనం కావడంతో ఆ హక్కులు ఎస్బిఐకి వచ్చాయి. ఇక్కడ ‘అడ్వాన్స్ కెపబిలి ఇన్ అండ్నో వెషన్ సెంటర్ పేరుతో రెండో ముంబయి తర్వాత దేశంలోనే అతిపెద్ద ప్రదర్శనశాలను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది.
వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతులు రావడంలో జాప్యం జరిగింది, అయితే ప్రహరీ, మౌలిక వసతులు, ఏటిఎంల ఏర్పాటుకు ఇప్పటి కే రూ.21.50 కోట్లకు పైగా ఖర్చు చేశామని బ్యాంకులు. ప్రస్తుతం భూమి తమ ఆధీనంలోనే ఉంది. గడువు పొడిగింపునకు టిజి ఐఐసి గతంలో చేసినప్పటికీ, ప్రభుత్వం 2021లో కేటాయింపును రద్దు చేసింది. ఒప్పందం బ్యాంకు కోర్టుకు వెళ్లగా, 2022లో శీల హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అనంతరం 2024లో ప్రభుత్వం మళ్లీ కేటాయింపు రద్దు చేయగా ఎస్బిఐ కోర్టును ఆశ్రయించింది. ఆ సమయంలో రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం చెప్పడంతో, బ్యాంకు వినతిని పరిశీలించాలని కోర్టు కేసు ముగిసింది. ఈ నేపథ్యంలో 2026 మే 4న ఎస్బిఐ అధికారులతో విచారణ జరిపిన టిజిఐఐసి దానిపై ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండానే మే 6న వేలం నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత మే 23న గడువు పొడిగింపుర్థనను తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
వాడీవేడీ వాదనలు..!
విచారణ సందర్భంగా కోర్టు హాల్లో ఇరుపక్షాల మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి. ప్రభుత్వం అడిషనల్ అడ్వకేట్ జనరల్ (ఎజి) ధర్మాసనం ఎదుట గట్టిగా వాదనలు వినిపించారు. ‘2010లోనే రాయదుర్గంలోని ఆ భూమికి సంబంధించి అప్పటి టిజిఐఐసితో ఎస్బిఐ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం రెండేళ్ల కాలపరిమితిలోనే అక్కడ నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది. కానీ, ఒప్పందం జరిగి దాదా పు 16 ఏళ్లు గడిచినా ఎస్బిఐ అక్కడ ఎలాంటి నిర్మాణ పనులు ప్రారంభించలేదు’ అని ఎజి కోర్టుకు విన్నవించారు. నిబంధనల ఉల్లంఘన వల్లే ఆ భూమిని వేలానికి పెట్టాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు. ఈజీ వాదనలపై స్పందించిన న్యాయమూర్తి తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ తీరును తప్పుబడుతూ ‘అసలు ఏ కారణంతో ఆ భూమిని వేలం వేశారు? అది ఎస్బిఐకి కేటాయించిన భూమి అని మీకు తెలీదా ఓ ప్రభుత్వ సంస్థ భూమిని ఇలా ఎలా వేలం వేస్తారు?’ అని ఏజిని నిలదీశారు. అంతేకాకుండా, ‘ఇలా భూములను వేలం వేస్తూ రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపారాన్ని పరుగులు పెట్టించాలనుకుంటున్నారా?’ అంటూ ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలపై ఏజీ కలుగజేసుకుంటూ కోర్టుకు వివరణ ఇచ్చారు. ఈ భూమిని వేలం వేయడం ద్వారా వచ్చే నిధులను ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు, సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తుంది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు రాయదుర్గం వేలంపై 3 వారాల పాటు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

