విజయవాడ థార్ కేసు: విజయవాడ హై టెన్షన్ రోడ్లో ఇటీవల ఇద్దరు యువకులు తమ థార్ కార్లతో పరస్పరం ఢీ కొట్టుకున్నారు. నడిరోడ్డు పైన రౌడీయిజం చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. వాళ్లకు ప్రాణం పోయినంత పని అయ్యింది. పోలీసుల రంగంలోకి దిగిన తర్వాత అసలు కథ మొదలైంది. దీని వెనుక ఏముంది.. అమ్మాయి వ్యవహారం మాత్రమేనా.. ఇంకా ఏదైనా జరిగిందా అనే కోణాలలో ఎంక్వయిరీ స్టార్ట్ చేశారు.
ఇందులో ఏ 1 బొల్లం ఓం కు మాదకద్రవ్యాల పరీక్ష చేస్తే పాజిటివ్ వచ్చింది.. ఏ 2 రోహిత్ లింగమనేని ఘటన స్థలం నుంచి పారిపోవాలని ప్రయత్నించాడు. అయినా పోలీసులు వదిలిపెట్టలేదు. అతడి వద్ద ఈ సిగరెట్లు.. ఇంకా రకరకాల పాదాలు దొరికాయి. కేవలం కాళ్లతో గుడ్డుకోవడంతోనే ఈ వ్యవహారం మొదలు కాలేదు. వీరి వాహనాలను తనిఖీ చేసిన పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. ఒకరి వాహనంలో హాకీ కర్రలు.. ఇనుప రాడ్లు బయటపడ్డాయి. మరొకరి కారులో స్టెరాయిడ్ ఇంజక్షన్లు దొరికాయి. ఇందులో రోహిత్ సాయి చదువుకుంటున్నాడు. ఓం తన తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు. సమాజంలో పేరు పొందిన వ్యక్తులు కుమారులైన వీరిద్దరూ ఇంతటి స్థాయిలో ఆందోళన కలిగిస్తున్నారు.
ఈ ఘటనలో నిందితుడి వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నట్టు టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఆయన తన రాజకీయ పలుకుబడి ప్రయోగించినప్పటికీ పోలీసులు తమ పని తాము చేసుకుపోయారని.. ప్రజలకు పోలీసుల పట్ల నమ్మకాన్ని కలిగించారని టిడిపి నేతలు అంటున్నారు. అందుకే థార్ గ్యాంగ్ కు పోలీసుల రేంజ్ అంటే ఏమిటో చూపించారని అంటున్నారు..
మత్తు తలకు ఎక్కి.. రాజకీయంగా అండ చూసుకొని.. వీధిలోకి వచ్చే ఇలాంటి రౌడీలకు పోలీసులు తమదైన ట్రీట్మెంట్ ఇచ్చారు. అందువల్లే అర్ధరాత్రి పూట విచ్చలవిడిగా వ్యవహరించిన రౌడీయిజం ఇప్పుడు జైలు గోడల మధ్య మూసుకొని కూర్చుంది. ఉన్మాదంతో గట్టిగా కేకలు వేసిన ఈ రౌడీ యువకులు ఇప్పుడు జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. మత్తు దిగింది కాబట్టి వాస్తవం అర్థమవుతోంది. ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకునే యువకులకు ఈ థార్ గ్యాంగ్ వ్యవహారం ఒక బలమైన గుణపాఠం.

