కోలీవుడ్ హిస్టరీలోనే జననాయకన్ చిత్రం రికార్డు స్థాయి ఓపెనింగ్స్‌ను నమోదు చేస్తుందని ఆశించిన అభిమానులకు, ట్రేడ్ వర్గాలకు ప్రస్తుత అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్స్ కొంత నిరాశను కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు అందుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ ప్రస్తుత ట్రెండ్ ని బట్టి చూస్తే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ కూలీ లేదా విజయ్ గత చిత్రం లియో సృష్టించిన ఓపెనింగ్స్ రికార్డులను అందుకునే అవకాశం లేదు.
తరుణంలో ఈ సినిమా మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం రూ. 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్‌ను అయినా సాధించగలదా అన్నదే ట్రేడ్ వర్గాల్లో పెద్ద ప్రశ్నగా మారింది. సాధారణంగా విజయ్ నటించిన గత చిత్రాలకు కనిపించే వారంతపు బుకింగ్స్ రద్దీ మరియు అడ్వాన్స్ టికెట్ సేల్స్ జోరు, ఈ సినిమా విషయంలో ఆ స్థాయిలో కనిపించడం లేదు. ఈ చిత్రానికి సంబంధించి గతంలో జరిగిన కొన్ని నెగెటివ్ పరిణామాలు సినిమా ప్రీ-రిలీజ్ హైప్‌ను దెబ్బతీసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా సినిమా ఆన్లైన్లో లీక్ కావడంతోపాటు పలుమార్లు విడుదల వాయిదా పడటం వంటి అంశాలు సినిమాపై ఉన్న సహజమైన ఊపును తగ్గించాయి. అయితే థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజే గనుక పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ గమనం పూర్తిగా మారిపోయి కలెక్షన్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ఇంతటి భారీ ఓపెనింగ్‌ను రాబట్టడం ఏ ఇతర స్టార్ హీరోకైనా దాదాపు అసాధ్యమైన పనే అని చెప్పాలి. కానీ సినిమాకు వ్యతిరేకంగా ఇన్ని అంశాలు కనిపించడం ఒక్క విజయ్ స్టార్డమ్ తిరుగులేని మాస్ ఫాలోయింగ్ మాత్రమే జననాయకన్ కోలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనర్‌గా మారుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

