Karuppu OTT విడుదల తేదీ: తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘కరుప్పు’ బాక్స్ ఆఫీస్ వద్ద వస్తున్న వసూళ్లు , తమిళ సినిమా ఇండస్ట్రీ కి పెద్ద బూస్ట్ ఇచ్చింది. ఎందుకంటే ఈ ఏడాది ఒక్క సినిమా కూడా వాళ్ళవి హిట్ అవ్వలేదు , మరో పక్క గెస్ట్ క్రౌడ్ పుల్లర్స్ అని పిలిచే అజిత్, విజయ్ వంటి వారు సినిమాలకు దూరం అయ్యారు , ఇక తమిళ సినిమా పరిస్థితి ఏంటో అని అందరూ బాధపడుతున్న సమయం లో ‘కరుప్పు’ చిత్రం వచ్చింది. ఈ సినిమా ఇంత పెద్ద కమర్షియల్ హిట్ అవుతుందని మేకర్స్ కూడా ఊహించలేదు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ , ఈ చిత్రం కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ సూపర్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకుంది.
తెలుగులో ఈ చిత్రం ‘వీరభద్రుడు’ అనే టైటిల్ తో విడుదలై , ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. ఇలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ నెట్ ఫ్లిక్స్ సంస్థ కేవలం 35 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. తెలుగు తో పాటు , అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ సినిమా ని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయబోతున్నారు. మేకర్స్ తో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం ఈ థియేటర్స్ లో విడుదలైన 4 వారాలకు ఓటీటీలో విడుదల చేయాలి. అందుకే జూన్ 2వ వారంలో ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. థియేటర్స్ లో రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు , ఆ రేంజ్ సునామీ ని తలపిస్తోంది ఈ చిత్రం.
మరి ఓటీటీ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి. చాలా మంది ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది , కానీ సెకండ్ హాఫ్ అసలు నచ్చలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓటీటీ నుండి కూడా ఇలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. లేకపోతే 5 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం 162 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ తో 200 కోట్ల గ్రాస్ మార్కుని కూడా అందుకోబోతుంది ఈ చిత్రం. మరి ఫుల్ రన్ లో 300 కోట్ల మార్కుని చూస్తుందో లేదో.

