అమరావతి: భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రకు మణికిరీటం అని కేంద్ర పౌర విమానయాన శాఖ ఎపి మంత్రి రామ్మోహన్ కొనియాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎయిర్ పోర్టు పూర్తయ్యిందని అన్నారు. ఎయిర్ పోర్టు పనులను వేగంగా పూర్తి చేశామని, ఏయిరో డ్రో లైసెన్స్ కూడా వచ్చిందని అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై సమీక్షించారు. రామ్మోహన్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగడం, మోడీ షెడ్యూల్ ఖరారైన తర్వాత తేదీ అని రామ్మోహన్ తెలియజేశారు. ఎయిర్ పోర్టు ప్రారంభమైన వారం తర్వాత ఆపరేషన్స్ అని విశాఖ ఎయిర్ పోర్టు కార్యకలాపాలు భోగాపురం తరలిస్తామని, భోగాపురంలో మరిన్ని ప్రాజెక్టులు వస్తాయని రామ్మోహన్ పేర్కొన్నారు.

