ఆంధ్రప్రదేశ్:టీటీడీ వేసవి సెలవుల రద్దీపై టీటీడీ ( TTD )అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్పందించారు.వేసవి సెలవులకు భక్తుల రద్దీ అధికంగా ఉందని, భక్తుల రద్దీ దృష్ట్యా టైం మేనేజ్మెంట్ పై దృష్టిపెట్టామన్నారు.
రోజూ అదనంగా 15 వేల మందిపైగా భక్తులకు దర్శనం జరగగా, గురువారం రికార్డు స్థాయిలో తొలిసారిగా 79 వేల మందికి దర్శనం చేసుకున్నారని, నిత్యం క్యూలైన్ మేనేజ్మెంట్ వల్ల దర్శనాల సంఖ్య పెరిగింది.టీటీడీ, విజిలెన్స్,పోలీసుల సమన్వయంతో భక్తులకు దర్శనాలు జరుపుతున్నప్పుడు, భక్తులకు దర్శనం కల్పిస్తామని భక్తులకు అనుమతి ఉంటుందన్నారు.
అభిషేకసేవ సమయంలో 5 వేల సర్వదర్శన భక్తులకు అనుమతిస్తామని తెలిపారు.

