Published on: 8:16 am, 30 మే 2026
సంచలన తీర్పును వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. వేశ్యావృత్తికి సంబంధించిన స్థితిని.. సెక్స్ వర్కర్ల ప్రాథమిక హక్కులపై స్పష్టంగా తెలియజేసారు. తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం.. వయోజనులు (మేజర్లు) అయిన వారు తమ సమ్మతితో వేశ్యవృత్తిని నిర్వహించడం నేరం కాదని స్పష్టం చేసింది.
అదే సమయంలో వ్యభిచారం నడపటం.. ఇతరుల సంపాదన మీద బతకటం.. బహిరంగ ప్రదేశాల్లో విటులను ఆకర్షించడం.. మైనర్లను బలవంతంగా ఇందులో దించటం మాత్రం చట్టప్రకారం శిక్షార్హమైన నేరాలు.
భారతీయ చట్టాల ప్రకారం ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం ఒక వయోజనుడు (మేజర్) తన పూర్తి సమ్మతితో వేశ్యవృత్తిని నిర్వహించడం నేరం కాదని స్పష్టం చేసింది.
తాజా తీర్పులోని సున్నితమైన అంశం ఏమంటే.. స్వచ్ఛందంగా వేశ్యవృత్తిలో ఉన్నా.. అక్రమ రవాణాకు గురై బలవంతంగా వేశ్యవృత్తిలో కూరుకుపోయిన వారిని ఒక్కసారిగా చూడకూడదని సుప్రీం స్పష్టం చేసింది. తమ ఇష్టంతో వేశ్యవృత్తిలో ఉన్న వారిని ట్రాఫికింగ్ బాధితులుగా చూడొద్దని స్పష్టం చేసింది.
అలాంటి వారిపై అక్రమ రవాణా.. ఇతర సీరియస్ క్రిమినల్ కేసులు పెట్టి వేధించొద్దని. అంతేకాదు ట్రాఫికింగ్ బాధితులకు గౌరవప్రదమైన పునరావాసం పొందే హక్కు ఉందని తేల్చింది. శుక్రవారం న్యాయమూర్తి పార్థీవాలా.. జస్టిస్ ఆర్.మహదేవన్లతో కూడిన ధర్మాసనం 22 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రజ్వల వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సిన సమగ్ర బాధితుల రక్షణ ప్రణాళికను అధికారికంగా విడుదల చేసింది. ఇందులో విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్ ను స్పష్టంగా తెలియజేస్తుంది.
ఇంతకూ సుప్రీంకోర్టు తీర్పులో కీలక అంశాలివే..
- ఒక కేసు మానవ అక్రమ రవాణా కిందకు వస్తుందా? లేదా స్వచ్ఛంద వేశ్యావృత్తి కిందకు వస్తుందా అని నిర్దారించటానికి వ్యక్తుల పరస్పర సమ్మతి అనేది అత్యంత కీలకమైన అంశమని కోర్టు స్పష్టం చేసింది.
- ఎక్కడైతే బలవంతంగా.. ఇష్టం లేకున్నా.. మోసంతోనో.. అక్రమ రవాణా జరిగినట్లుగా ఆధారాలు ఉంటాయో..అలాంటి సందర్భంలో సదరు వ్యక్తి ఇచ్చినట్లుగా చూపితే సమ్మతికి చట్టపరంగా ఎలాంటి విలువ ఉండదు. దీనికి కారణం.. బాధితురాలికి ఇష్టం లేకున్నా.. బలవంతంగా.. బెదిరింపులతో వేశ్యావృత్తిని నిర్వహిస్తున్నారు కాబట్టి.. కచ్చితంగా అది చట్టవిరుద్ధం. దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.
- ఈ తీర్పులో అత్యంత కీలకమైన అంశంగా దీన్ని చెప్పాలి. దాడులు జరిగిన చోట తక్షణ ప్రాథమిక విచారణ జరపాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న మహిళ లేదా బాధితురాలు ఎవరైనా వివక్ష.. శారీరక హింసకు గురవుతున్నారా? బలవంతపు ట్రాఫికింగ్ చేస్తున్నారా? అన్నది మాత్రమే పరిశీలించాలి. అదే సమయంలో సమ్మతితో వేశ్యవృత్తిలో ఉన్న మేజర్లు(వయోజనులు)నేరస్థులుగా చిత్రీకరించకూడదు
- ఒకవేళ అక్రమ రవాణాకు గురైన బాధితురాలిని ఆ బంధనాల నుంచి విముక్తి చేసే వేళ.. రాజ్యాంగంలో పునరావాసం కల్పించడం ఆర్టికల్ 21 ప్రకారం వారి ప్రాథమిక హక్కు అన్న అత్యున్నత న్యాయస్థానం వారికి స్పష్టం చేసింది.
- ఈ సందర్భంగా బాధితులను ఉంచే రక్షణ గృహాలు. వారికి తగిన మెంటల్ హెల్త్ సపోర్టు.. ఉచితంగా చట్టపరమైన సాయాన్ని అందించడంతో పాటు జీవనోపాధి కోసం ఒకేషనల్ (వృత్తి విద్యా) శిక్షణ తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది.
- రాజ్యాంగం ద్వారా తమకు దఖలు పడిన మేరకు (ఆర్టికల్ 32, 142 ప్రకారం) దేశ వ్యాప్తంగా బాధితుల రక్షణ ప్రణాళికను అమలు చేయడానికి తాము ఆదేశిస్తున్నట్లుగా పేర్కొనబడింది. ఈ కేసుకు సంబంధించి తీర్పు ఇచ్చే వేళ.. తమ మనసుల్ని స్పృశించిన కేసుగా న్యాయమూర్తులు పేర్కొన్నారు.
- ఇంతకాలం బాధితుల రక్షణ.. పునరావాసం.. వివిధ విభాగాల సమన్వయం.. ట్రాఫికింగ్ చట్టాల దుర్వినియోగం.. కేసుల దర్యాప్తులో నెలకొని లోపలకు వెళ్లి తామీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు గుర్తించారు. అదే సమయంలో తమ ప్రభుత్వ ప్రకటనను కేంద్రం.. రాష్ట్రాలు ఎలా అమలు చేశాయో పరిశీలించేందుకు మూడు నెలల తర్వాత ఈ అంశంపై మరోసారి విచారణ జరుపుతామని.
- ఈ తీర్పు చాలా సమయం పట్టిందని తెలియజేసారు. ఎందుకంటే ఈ పిల్ 22 ఏళ్లుగా న్యాయస్థానాల్లోనే ఉంది. ఈ సందర్భంగా పక్షంగా ప్రస్తావిస్తూ చాలా సమయం అన్న మాటను చూడాల్సిన అవసరం ఉంది.. మరి.. ఈ అంశాల చట్టాలను అమలు చేసే వ్యవస్థలు ఎలా పనిచేస్తాయన్నది ఇప్పుడు అసలు ప్రశ్నగా చెప్పొచ్చు.

