ఆంధ్రప్రదేశ్:సాయికృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును(మాజీ CI నాగరాజు ) ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అరెస్ట్ చేసింది.
అరెస్టును అడ్డుకునేందుకు వివిధ స్థాయిల్లో ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి ఫలించలేదని సమాచారం.నాగరాజు అరెస్టు తర్వాత విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
కేసు దర్యాప్తు వేగవంతం కావడంతో పాటు ఆయనపై వస్తున్న ఇతర ఆరోపణలపైనా విచారణకు అవకాశం లేదని సమాచారం.ఇప్పటికే నాగరాజుపై అక్రమాస్తులు, బినామీల పేరుతో ఆస్తుల సమీకరణ తదితర ఆరోపణలు కూడా వెలుగులోకి రావడంతో దర్యాప్తు మరింతగా విస్తరించే అవకాశం ఉందని సమాచారం.
ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు,ఆస్తుల వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే, వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు,బినామీ ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారణ.
ఈ దర్యాప్తు కొనసాగుతోంది.మాజీ సీఐఐ అరెస్టుతో కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకోగా,తదుపరి విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

