భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. శనివారం పవన్ కు శస్త్ర చికిత్స జరగ…ఆ మరునాడే ఆదివారం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేరుగా ముంబై వెళ్లి మరీ పవన్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన బాబు… పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆపరేషన్ చేసిన వైద్యులతోనూ చంద్రబాబు మాట్లాడారు. సేనాని పూర్తిగా కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందన్న దానిపై ఆయన ఆరా తీసిన సమాచారం.
రాజకీయాల్లోకి రాకముందు జన సేనాని సినిమా నటుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కావాలనే 2018లో ఓ సినిమా షూటింగ్ లో జరిగిన చిన్నపాటి ప్రమాదం నేపథ్యంలో పవన్ రెండు భుజాలకు గాయాలయ్యాయి. ఆ గాయాలకు అప్పుడే చికిత్స తీసుకుని ఉంటే సరిపోయేదేమో. అయితే షెడ్యూల్ ఖరారు అయిన సినిమా షూటింగ్ లు, ఇతర రాజకీయ కార్యక్రమాల నేపథ్యంలో ఆ చికిత్సలను పవన్ అలా వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇటీవలే ముక్కుకు జరిగిన ఆపరేషన్ సందర్భంగా భుజం గాయం తీవ్రతను పవన్ చెప్పడంతో తప్పనిసరి పరిస్ధితుల్లో ఆయన ఆపరేషన్ కు తలూపారు.
సినిమా షూటింగ్ లోనే గాయం అయినా… జన బాహుళ్యంలోకి వచ్చినప్పుడు పవన్ తో చేయి కలపాలంటే ఆయన అబిమానులు ఒక్కోసారి అత్యుత్సాహం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఓ సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగిన పవన్ కు ఎనలేని అభిమాన గణం ఉంది. ఆ అభిమానులతో పవన్ తో కరచాలంతా కూడా చేయాలని కోరుకునేవారే. ఈ విధంగానే చాలాసార్లు ఆయన చేతులను పట్టుకుని మరీ పవన్ ను లాగేసిన సందర్బాలు ఉన్నాయి. ఈ కారణంగా భుజం గాయాలు మరింతగా పవన్ ను బాధించాయి. అయినా ఓర్పుతో ఆ నొప్పిని భరిస్తూనే పవన్ సాగారు.
పవన్ కు పరామర్శ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ కు చంద్రబాబు ఓ కీలక సూచన చేశారు. పవన్ హీరోనే…సినిమాలోనే కాకుండా రాజకీయాల్లోనూ సక్సెస్ సాధించి పవన్ ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ పవన్ ఎప్పుడు బయటకు వచ్చినా…ఆయనతో కరచాలనం చేయాలనే ఆసక్తి ఉన్నా… పవన్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా దానిని మానుకోవాలని ఫ్యాన్స్ కు బాబు సూచించారు. కేవలం కరచాలనం కోసమే పవన్ ను చుట్టుము… భుజం గాయాలు మరింతగా పెచ్చరిల్లే ప్రమాదం లేకపోలేదన్న ఫ్యాన్స్ గమనించాలన్న వాదనను బాబు వినిపించారు. వెరసి అభిమానమే పవన్ కు అడ్డుకట్ట వేయరాదన్న భావనను బాబు వ్యక్తపరిచారు.

