హైదరాబాద్ లో చేపమందు పంపిణీ కొనసాగుతుంది. మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబం ఆధ్వర్యంలో నిన్న రాత్రి ప్రారంభమయిన చేపమందు పంపిణీ నేడు కూడా కొనసాగుతుంది. ఈరోజు రాత్రి 9 గంటల వరకూ చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు.
ఈరోజు రాత్రి 9 గంటల వరకూ…
చేప ప్రసాదాన్ని స్వీకరించడానికి దేశం నలుమూలల నుంచి వేలాది మంది తరలి రావడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కిటకిటలాడుతుంది. నాంపల్లికి వెళ్లే మార్తంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చేప ప్రసాదం కోసం ప్రభుత్వం మొత్తం మూడు లక్షల చేప పిల్లలను సిద్ధం చేసింది. ఇప్పటికే యాభై వేల మందికి పైగా చేప ప్రసాదాన్ని స్వీకరించారు. పోలీసులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

