ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ స్కీమ్: ఏపీకి గుడ్ న్యూస్ అందించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మరోసారి పేదలకు ఇంటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర పట్టణ శాఖ రాష్ట్రానికి కొత్తగా 12,370 ఇళ్లు ఇవ్వనుంది. తొలి విడతగా రూ.74.22 కోట్లు ఇవ్వనుంది. కేంద్ర గృహ నిర్మాణ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ ఇటీవల నిర్వహించిన సిఎస్ ఎం సి సమావేశంలో కొత్త ఇళ్లు అందించడానికి అనుమతి లభించింది. ఈ మంజూరైన ఇళ్లను రాష్ట్రవ్యాప్తంగా 119 పట్టణ స్థానిక సంస్థల్లో నిర్మించనున్నారు.
* త్వరగా నిర్మిస్తేనే..
అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏపీతోపాటు అన్ని రాష్ట్రాలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ అర్బన్ 2.0 కింద ఇళ్లను అందించింది. సెప్టెంబర్ 30లోగా ఆ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని.. ఒకవేళ చేస్తే కేంద్రం నుంచి వచ్చే సాయం నిలిపి వేస్తామని హెచ్చరిస్తోంది. ఆ తరువాత ఖర్చులు రాష్ట్రాలు భరించాలని తేల్చి చెప్పింది. ఏపీకి కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం కింద.. గతంలో రూ.233.80 కోట్లు ఇస్తే రూ. 41. 85 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన ఇళ్ల నిర్మాణం కోసం వెచ్చించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీలో 2026 మార్చి నాటికి 1,20,000 ఇళ్ల నిర్మాణం కోసం పెట్టుకున్నారు.. 45230 ఇళ్లకు మాత్రమే ప్రతిపాదనలు సమర్పించారు. రాష్ట్రానికి మంజూరైన ఇళ్లలో కేవలం 16,283 మాత్రమే మొదలయ్యాయి. రాష్ట్రంలో 45,230 ఇళ్లకు సంబంధించి నిధులు విడుదల అయ్యాయి. అందులో 12,776 మంది లబ్ధిదారులకు మాత్రమే వాటిని అందించగలిగారు. ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకానికి సంబంధించి కేంద్రం నుంచి వచ్చిన సాయం, ట్రెజరీలో ఉన్న రూ.121.71 కోట్లు కేంద్రం ఇచ్చిన నిధులపై కీలక ఆదేశాలు ఇచ్చారు. బి ఎల్ సి ఇల్ల నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు. ఈ ఇళ్లకు కేంద్రం నుంచి సాయం అందదు
* ఆసక్తి అంతంతే..
అర్బన్ పథకానికి సంబంధించి కేవలం మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలోని లబ్ధిదారులు అర్హులు. అయితే ఇప్పటికే పట్టణాలు చాలామంది గృహ నిర్మాణంలో లబ్ధిదారులుగా ఉన్నారు. అందుకే ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి ఎవరు ముందుకు రాని పరిస్థితి. మరోవైపు ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో పోల్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే గృహ నిర్మాణం సాయం ఎక్కువ. అందుకే లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే అప్పట్లో మంజూరైన ఇళ్లకు సంబంధించిన నిర్మాణం చేపట్టకపోతే రద్దు అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినా లబ్ధిదారుల నుంచి ఆశించిన స్థాయిలో ఆసక్తి కనిపించడం లేదు. అయితే ఇప్పుడు కొత్తగా ఇల్లు పొందుతున్న తరుణంలో.. పాత లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.

