ఈరోజు 10 జూలై 2026 జాతకం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీనితో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి తాండవం చేయనుంది. రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): . ఈ రాశి వారు ఈ రోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. దూర ప్రయాణాలు చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏదైనా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. కలిగి ఉల్లాసంగా ఉంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు సంతోషకరమైన జీవితం ఉంటుంది. గతంలో ఉన్న కష్టాల నుంచి బయటపడతారు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించాలి.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఉద్యోగులకు కార్యాలయాల్లో తోటి వారి సహకారం ఉంటుంది. ఇదే సమయంలో అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల అండదండలతో వ్యాపారులు లాభాలు పొందుతారు. గతంలో కంటే ఇప్పుడు సానుకూల ఫలితాలు ఉన్నాయి. అనుకున్న కోరికలను నెరవేర్చుకుంటారు. ప్రియమైన వారికోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కొత్తగా పెట్టుబడును పెట్టాలని అనుకుంటే ఇదే మంచి సమయం. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను పూర్తి చేస్తారు. పాత వివాదాల నుంచి బయటపడతారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనులను పరిష్కరించుకుంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజల నుంచి మద్దతు ఉంటుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు విదేశాలకు వెళ్లాలని అనుకుంటే ఇదే మంచి సమయం. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధం చేసుకుంటారు. అయితే ఇదే సమయంలో ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే ఇదే మంచి సమయం. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి వస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు అనుకోకుండా ధననీయమైన ఆదాయాన్ని పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. క్రమశిక్షణతో పనులు చేయడం వల్ల ముఖ్యమైన వాటిని పూర్తి చేస్తారు. కొత్త అవకాశాలు లభిస్తాయి
ధనస్సు రాశి ( మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి ఇతరుల సహకారం తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గతంలో కంటే ఇప్పుడు వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు తోటి వారి సహకారంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త ఆదాయం లభిస్తుంది. బ్యాంకు నుంచి రుణం కోసం ప్రయత్నిస్తే సక్సెస్ అవుతుంది. విద్యార్థుల పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దూర ప్రయాణాలు చేసే సమయంలో సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి నిరుద్యోగులకు ఈరోజు శుభవార్తలు అందుతాయి. స్నేహితుల సహకారంతో అప్పుల నుంచి బయటపడతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు లాభాలు రానున్నాయి. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగుల లక్ష్యాలను ఏర్పరచుకుంటే వాటిని పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం.

