హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబపూర్ లో దారుణం జరిగింది. భర్తను భార్య హత్య చేసింది. సయ్యద్ (36) అనే వ్యక్తి రాత్రి మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడడంతో వేధింపులు తట్టుకోలేక భార్య గోరేబి మట్టి పెళ్లలతో భర్త తలపై కొట్టి చంపింది. ఈ ఘటనలో సయ్యద్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భార్య గోరేబి, కుమారుడు సయ్యద్ అలీను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాలతో హత్య చేసినట్లు పోలీసులు.

