హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఎయిర్ ఏషియా విమానంలో బాంబు పెట్టినట్లు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరకముందే విమానాన్ని పేల్చేస్తామంటూ మెయిల్‌తో అధికారులు చర్యలు చేపట్టారు.
తనిఖీలు చేయడంతో…
అయితే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఏషియా విమానం సేఫ్‌గా ల్యాండింగ్ అయింది. తనిఖీలు చేసిన బాంబ్ స్క్వాడ్ బాంబు లేదని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మలేషియా నుంచి శంషాబాద్ వస్తున్న ఎయిర్ ఏషియా విమానానికి ఈ బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.

