బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత కొద్ది రోజులుగా పోక్సో కేసులో నిందితుడిగా ఉండి తప్పించుకు తిరుగుతున్న బండి భగీరథ్ పోలీసులకు సరెండర్ అయ్యారు. న్యాయవాదుల ద్వారా తన కుమారుడు భగీరథ్ ను పోలీసులకు అప్పగించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. బండి భగీరథ్ కోసం ఐదు పోలీసు బృందాలు ప్రత్యేకంగా గాలిస్తున్నాయి. పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు.
తమకు అప్పగించినట్లు…
తాను తప్పు చేయలేదని తన కుమారుడు చెబుతున్నాడని, అయితే చట్టం ముందు తన బిడ్డ అయినా, సామాన్యుడయినా సమానమేనని బండి సంజయ్ చెప్పాడు. అందరూ చట్టానికి లోబడి ఉండాల్సిందేనని బండి సంజయ్ అన్నారు. బండి భగీరథ్ లొంగిపోవడాన్ని పోలీసులు కూడా నిర్ధారించారు. తన కుమారుడు నిర్దోషిగా బయటపడతారనే నమ్మకం తనకు ఉందని బండి సంజయ్ చెప్పారు.

