ఐపీఎల్ నేడు మరో బిగ్ ఫైట్ జరగనుంది. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఢీకొంటుంది. చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నైకి కీలకం. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ కు కూడా అంతే ముఖ్యం. ప్లే ఆఫ్ రేసులో ముందు ఉండాలంటే ఇరు జట్లు గెలుపు కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్ ఉత్కంఠ భారతంగా సాగే ఛాన్స్ ఉంది.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకూ పన్నెండు మ్యాచ్లు ఆడి ఏడు మ్యాచ్లలో గెలిచింది. ఐదు మ్యాచ్లలో ఓడింది. పథ్నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొత్తం పన్నెంబడు మ్యాచ్లు ఆడి ఆరు మ్యాచ్లలో గెలిచింది. ఆరింటిలో ఓడింది. పన్నెండు పాయింట్లతో ప్లే ఆఫ్ కోసం పోరాడుతుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం.

