ఐపీఎల్ లో ఈరోజు మరో టఫ్ ఫైట్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఢీకొంటుంది. హైదరాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం. ఇరు జట్లు ఇప్పటికే ప్లేఆఫ్ కు చేరుకున్నాయి. మొదటి స్థానంలో బెంగళూరు జట్టు, మూడో స్థానంలో హైదరాబాద్ జట్టు ఉంది. ఈరోజు జరిగే మ్యాచ్ లో విజయంపై స్థానాలు మారతాయి.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకూ పదమూడు మ్యాచ్లు ఆడి ఎనిమిది మ్యాచ్లలో గెలిచి ఐదు మ్యాచ్లలో ఓడింది. పదహారు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటి వరకూ పదమూడు మ్యాచ్లు ఆడి 9 మ్యాచ్లలో గెలిచి నాలుగు మ్యాచ్లలో ఓడింది. పద్దెనిమిది పాయింట్లతో అగ్ర స్థానంలో ఉంది. ఈరోజు మ్యాచ్ లో మాత్రం గెలుపు ఎవరన్నది ఉత్కంఠగా మారనుంది. మ్యాచ్ ను చూసేందుకు అధిక సంఖ్యలో అభిమానులు ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటున్నారు. హైదరాబాద్ లో చివరి మ్యాచ్ కావడంతో భారీగా అభిమానులు వస్తారని భావించి పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.

