ఈ సినిమా ఓపెనింగ్ పూజ కార్యక్రమం నేడు జరిగింది. (మొహబ్బత్)
మొహబ్బత్
మొహబ్బత్ : సంతోష్ కల్వచెర్ల, శ్రేయాసి సేన్ జంటగా తెరకెక్కుతున్న సినిమా మొహబ్బత్. ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఆఫ్రోజ్ షేక్ నిర్మాణంలో సలీమ్ మాలిక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ఓపెనింగ్ పూజ కార్యక్రమం నేడు జరిగింది. ఈ చిన్న శ్రీశైలం యాదవ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథులుగా. ముహూర్తపు సన్నివేశానికి నవీన్ యాదవ్ క్లాప్ కొట్టగా నిర్మాత ఆఫ్రోజ్ షేక్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం నవీన్ యాదవ్ మొహబ్బత్ సినిమా ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసారు.

అనంతరం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. ఆఫ్రోజ్ అన్న నిర్మాతగా కొత్త వారికి ప్రోత్సాహం అందించారు. సినీ కార్మికుల కష్టాలు నాకు తెలుసు. ఎన్ని కష్టాలు వచ్చినా సినిమాల్ని నిర్మిస్తూనే ఉంటారు. మొహబ్బత్ కోసం పని చేస్తున్న అందరికి ఆల్ ది బెస్ట్ అని అన్నారు. సలీమ్ మాలిక్ డైరెక్టర్ మాట్లాడుతూ.. ఎమోషనల్ యూత్ ఫుల్ జెన్ జీ సినిమాగా మొహబ్బత్ రానుంది. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది.
ఇది కూడా చదవండి: Buchibabu Sana : బుచ్చిబాబుది ఎంత మంచి మనసో.. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో..
నిర్మాత ఆఫ్రోజ్ షేక్ మాట్లాడుతూ.. నా ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ పై మొదటి సినిమాగా మొహబాట్ సృష్టించాను. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది.

