ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న లోకేశ్ టీడీపీ పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. ఈరోజు అనేక కేంద్ర మంత్రులతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి, పెండింగ్ ప్రాజెక్టులపై లోకేశ్ చర్చించనున్నారు.
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో …
అనంతరం నేడు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేశ్ తిరిగి అమరావతికి బయలుదేరి రానున్నారు. కేంద్ర మంత్రులతోనూ భేటీ కానున్నారు.

