వెంకటేష్ సినిమా వివాదం: వెంకటేష్ హీరోగా తెరకెక్కిన చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. కెరియర్ మొదట్లో ఆయన మాస్ సినిమాలు చేసినప్పటికి ఒకానొక టైం లో ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పిస్తూ ప్రేక్షకులందరినీ అలరించాడు. ముఖ్యంగా శోభన్ బాబు తర్వాత అంతటి ఇమేజ్ ను సంపాదించుకున్న తెలుగు హీరో కూడా తనే కావడం విశేషం…వెంకటేష్ వైవిధ్యభరితమైన పాత్రలను పోషించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అయితే ఆయన చేసిన చంటి సినిమా విషయంలో అప్పట్లో చాలా వరకు నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి…ఇక సినిమా స్టార్ట్ అయ్యే సమయంలో ఈ మూవీ ని వెంకటేష్ తో చేస్తున్నాము అని అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది చాలా రకాలుగా ఉన్నారు. తమిళంలో ‘చిన్న తంబి’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేశారు. అయితే ఒరిజినల్ వెర్షన్ ను పి వాసు డైరెక్షన్ చేశాడు.
తెలుగులో కూడా అతనితోనే డైరెక్షన్ చేయిద్దామని రామానాయుడు అడిగితే వెంకటేష్ హీరోగా చేస్తే ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడదని చెప్పారట. కారణం ఏంటంటే అప్పటికే వెంకటేష్ మాస్ హీరోగా అవతరించాడు. ఈ సినిమాలో హీరోగా పెద్దగా మైండ్ మెచ్యురిటి లేని క్యారెక్టర్ లో నటించాల్సి ఉంటుంది.
అది వెంకటేష్ చేస్తే అంత పెద్దగా ఎఫెక్టివ్ గా ఉండదని దానికంటే ఇమేజ్ లేని హీరోతో చేస్తే బాగుంటుందని చెప్పారట. ఆ విషయానికి కన్విన్స్ కానీ రామానాయుడు రవిరాజా పినిశెట్టిని తీసుకొచ్చి చంటి పేరుతో ఆ సినిమాను రీమేక్ చేశారు. మొత్తానికైతే ఈ సినిమా సూపర్ సక్సెస్ నిైతే. ఇక వెంకటేష్ బ్లాక్ కెరీర్లో ఉన్న బిగ్గెస్ట్ బస్టర్ సక్సెస్లలో చంటి సినిమా కూడా ఒకటిగా నిలవడం విశేషం…
ఇక ఏది ఏమైనా కూడా ఏ సినిమా ఎవరికి బాగుంటుంది. ఎవరు క్యారెక్టర్ లో ఒదిగిపోతారనేది చెప్పడం చాలా కష్టం…స్క్రీన్ మీద ఒకసారి కనిపిస్తే ప్రేక్షకులు ఆటోమేటిగ్గా వాళ్ళని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఏ క్యారెక్టర్ ని ఎవరు చేసిన కూడా సక్సెస్ ఫుల్ గా నిలబడవచ్చనే ఉద్దేశ్యంతోనే వెంకటేష్ ‘చంటి’ సినిమాతో ప్రూవ్ చేశాడు…

