ముంబై ఆటో డ్రైవర్ నిజాయితీ: నీతి అనేది లేదు. నిజాయితీ అనేది కనిపించడం లేదు. పాప భీతి మనుషుల్లో మచ్చకైనా అగుపించడం లేదు. అందుకే రోజులు ఇలా మారిపోతున్నాయి. సాటి మనిషి మీద నమ్మకం కోల్పోయిన దుర్ధినాలు దాపురించాయి. ఇలాంటి రోజుల్లో కూడా నిజాయితీగా ఉండేవారు. కాకపోతే వారు అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. ఈ కథనంలో మనం చెప్పే ఆ వ్యక్తి కూడా అటువంటి వాడే.
మనది కానీ డబ్బు ఖాతాలో పడితే ఎలా ఉంటుంది.. మిగిలిన వాళ్ళకి ఏమో గాని ఇతడికి మాత్రం ఆ డబ్బు పాముగా అనిపించింది. ఎందుకంటే పరుల సొమ్మును పాము లాగానే భావించాలని పెద్దలు చెప్పేవారు. ఇతడు కూడా అదే విధంగా అనుకున్నాడు. మాటకు తావు లేకుండా అలా వచ్చిన సొమ్మును వెంటనే అలానే పంపించాడు. తన నిజాయితీ నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా దేశవ్యాప్తంగా చర్చకు కారణమయ్యాడు.
ఇటీవల మన దేశ ఆర్థిక ముంబై రాజధాని నగరంలో శుభం అనే వ్యక్తి ఆటోలో ప్రయాణించాడు. దీనికిగాను అతడు 156 రూపాయలు చార్జి చెల్లించాల్సి ఉంది. అయితే 156 రూపాయలకు గాను 15,682 బదిలీ చేశాడు. ఆ తర్వాత శుభం తన దారిన తాను వెళ్లిపోయాడు. వెంటనే తను చేసిన తప్పును గుర్తించి శుభం ఎక్కడైతే దిగాడో అక్కడికి వచ్చాడు. అక్కడే డ్రైవర్ అల్తాఫ్ ఉన్నాడు. జరిగిన శుభం చెప్పాడు.
ఆల్తాఫ్ ఆ డబ్బును వెంటనే తిరిగి పంపించాడు. డ్రైవర్ నిజాయితీని కదిలించిందని శుభం చెప్పాడు. అంతేకాదు ఆ డబ్బులు ఇచ్చిన కృతజ్ఞతగా 500 ఇవ్వబోతే ఆటో డ్రైవర్ తీసుకోలేదని.. బలవంతంగా అతను జేబులో పెట్టి వచ్చారని శుభం చెప్పాడు. అతడు తనకు ఎదురైన ఈ అనుభవాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నాడు. అది కాస్త ఇప్పుడు విపరీతమైన చర్చకు దారితీస్తోంది.
“నిజాయితీ అనేది మనుషుల్లో ఉంది. కాకపోతే తగ్గిపోయింది. ఈ ఆటో డ్రైవర్ తన నిజాయితీని నిరూపించుకున్నాడు. ఆ సొమ్ము తనది కాదని వెంటనే తిరిగి ఇచ్చాడు. చాలామంది ఇలా చేస్తారు. ఎందుకంటే ఒకసారి డబ్బు ఖాతాలో పడితే ఎవరు కూడా ఇవ్వడానికి ఒప్పుకోరు. కానీ ఇతడు మనుషుల్లో ఉన్న మాణిక్యం అంటూ” సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

