వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యాన్ని రాబోయే వారం రోజుల్లో పూర్తి స్థాయిలో కొనుగోలు చేసినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. స్థానిక వ్యవసాయ సముదాయ గిడ్డంగి గోదాముల్లో స్థలం సరిపోకపోతే.. ఇప్పటికే పెద్దపల్లిలో కొన్ని ప్రైవేట్ గోదాములను లీజుకు తీసుకున్నామని, రైతులకు ఎలాంటి ఇబ్బంది రానివ్వమని భరోసా ఇచ్చారు.
గత బీఆర్ఎస్ పాలనతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ధాన్యం కొనుగోళ్లు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి వివేక్ ఏర్పాటు చేశారు. జూన్ 15వ తేదీ వరకు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది.. ఈరోజు అంటే 27 నాటికే లక్ష 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి రికార్డు సృష్టించింది. ఈసారి 15 రోజుల ముందే పంట చేతికి రావడం, దిగుబడి కూడా భారీగా పెరగడంతో.. హమాలీలు, లారీల కొరత వల్ల అక్కడక్కడ కొనుగోళ్లు కొంత ఆలస్యమైన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు.
అయితే లారీల కొరత రాకుండా ఉండేందుకు మంచిర్యాల, భూపాలపల్లి TGMDCIతో ఇప్పటికే మాట్లాడామని.. కొనుగోలు కేంద్రాల వద్దకు మరిన్ని లారీలను తరలిస్తున్నామని చెప్పారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లతో నిరంతరం సమీక్షిస్తూ.. ధాన్యానికి త్వరితగతిన గోదాములకు తరలించేలా యుద్ధప్రతిపాదికన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.
ఇదే సమయంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన వివాదస్పద వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు.” సింగరేణి భవనాలను తగలబెట్టండి. దీన్నిబట్టి బీఆర్ఎస్ పార్టీపై, ఆ పార్టీ నేతలపై తెలంగాణ రైతులకు నమ్మకం పూర్తిగా పోయిందని అర్థమవుతోంది అని మంత్రి ఎద్దేవా చేశారు.

