ఢిల్లీలో సిద్దరామయ్య పర్యటన కొనసాగుతుంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్‌తో ముగిసిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రతో పాటు కేసీ వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలు ఉన్నారు. మరొకవైపు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటే పార్టీ నాయకత్వం చర్చలు తీసుకుంటుంది.
తన కుమారుడు యతీంద్రకు ప్రాధాన్యత ఉన్న శాఖను సిద్ధరామయ్య కోరినట్లు తెలిసింది. విద్యాశాఖ లేదా ఆరోగ్య శాఖను కేటాయించాలని సిద్ధరామయ్య కోరుతున్నారని చెప్పారు. అయితే ఈ సమావేశంలో పలు రాజకీయ అంశాలపై చర్చిస్తామని సూర్జేవాలా చెప్పారు. కేబినెట్ కూర్పులో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. డిప్యూటీ సీఎంలుగా లింగాయత్, ఎస్సీ సామాజికవర్గం నుంచి ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

