హైదరాబాద్, వెలుగు: జూన్12వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. 99 డేస్ యాక్షన్ పాన్‌లో భాగంగా.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి గ్రామ సభలు ఉంటాయని వివరించారు. మహిళలను కోటిశ్వరులుగా మార్చడమే తమ లక్ష్యమన్నారు. అందులో భాగంగానే పంట ఉత్పత్తులను సేకరించడం, గోడౌన్లను నిర్మించడం, రైస్‌మిల్లులకు అప్పగించడం, ఆ తరువాత ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి ప్రొడక్ట్‌లను తీసుకురావడం వంటి అన్ని మహిళా స్వయం సంఘాలకు అప్పగించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

