డోనాల్డ్ ట్రంప్ సరిహద్దు గోడ: పరిపాలుడికి దూర దృష్టి ఉండాలి. మూర్ఖత్వం ఉండకూడదు. ఆలోచన ఉండాలి.. ఆవేశం ఉండకూడదు. పరిపాలన మీద పట్టు ఉండాలి. పిచ్చోడి చేతిలో రాయి వలె వ్యవహరించకూడదు. ఇవన్నీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఆమోదించారు.
ప్రపంచ దేశాల మీద ఇప్పటికే టారిఫ్ లు విధించాడు ట్రంప్ మహాశయుడు. ఇరాన్ దేశం మీద అనవసరమైన యుద్ధాన్ని ప్రకటించాడు. నెలల పాటు యుద్ధం చేసి ప్రపంచాన్ని ఇబ్బందుల్లో పెట్టాడు. చివరికి అమెరికా ప్రజలకు చుక్కలు చూపించాడు. యుద్ధం మీద అమెరికా పార్లమెంట్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ట్రంప్ వెనక్కి తగ్గాడు. అంతేకాదు ఇప్పుడు శాంతి వచనాలు వల్లిస్తున్నాడు.
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయమే కాదు.. అమెరికాకు పొరుగున ఉన్న దేశాలపై తీసుకుంటున్న నిర్ణయాలు కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇప్పటికే మెక్సికో సరిహద్దుల్లో గోడను మరింత పటిష్టంగా మార్చాడు ట్రంప్. అమెరికాలో ఉంటున్న మెక్సికో ప్రజలను బలవంతంగా యుద్ధ ఖైదీలతో తరలించాడు. అమెరికాలో ఉంటున్న మెక్సికో దేశస్థులను వెళ్ళగొడుతున్నాడు. ఇంతవరకు బాగానే ఉండే మెక్సికో ప్రజలు అమెరికా నుంచి వెళ్ళిపోతే.. శ్వేత దేశ ప్రజలు అడుక్కుతినాల్సిందే.
మనదేశంలో వివిధ రాష్ట్రాల్లో బీహార్.. ఉత్తర ప్రదేశ్.. వెస్ట్ బెంగాల్ కూలీలు పని చేస్తున్నారు. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉంటుంది. అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ మూడు రాష్ట్రాల కూలీలు గనుక లేకపోతే భారత దేశంలోని అనేక ప్రాంతాలలో అన్ని పనులు ముందుకు సాగవు. చాలావరకు కార్యకలాపాలు ఆగిపోతాయి. నష్టం చోటు చేసుకుంటుంది. సేమ్ అమెరికాలో కూడా ఇదే పరిస్థితి. అమెరికాలో ఇంటి పని.. వంట పని.. మూత్రశాలలు.. మరుగుదొడ్లు శుభ్రపరచడం.. గార్డెన్లో గడ్డి కత్తిరించడం.. వీధులు ఊడ్చడం.. కొమ్మలు కత్తిరించడం వంటి పనులను మెక్సికో కార్మికులు నిర్వహిస్తున్నారు.
మెక్సికో దేశంలో అంతగా సౌకర్యాలు ఉండవు. అందువల్ల ఉపాధి కోసం అమెరికా వస్తుంటారు. ఇప్పుడు మెక్సికో సరిహద్దుల్లో ట్రంప్ గోడ కట్టిస్తున్నాడు. మెక్సికో ప్రజలు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇదే గనక దీర్ఘకాలంలో జరిగితే అమెరికాలో పనిచేసే వారు ఉండరు. అప్పుడు అమెరికా మొత్తం మురికి మయంగా మారుతుంది. పనిచేసే వారు ఉండరు కాబట్టి అమెరికా అక్కుతినాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

