విజయ్ రాజకీయ నిర్ణయాలు: తమిళనాడులో రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి డా. సి. జోసెఫ్ విజయ్ ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని సహకార బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందిన లక్షలాది మంది రైతులకు ఊరటనిస్తూ భారీ రుణమాఫీని ప్రకటించారు. సోమవారం సచివాలయంలో వ్యవసాయ, ఆర్థిక శాఖల మంత్రులు, నిర్వహించిన సుదీర్ఘ సమీక్షా సమావేశం అనంతరం సీఎం ఈ కీలక ప్రకటన చేశారు. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సామాన్య, మధ్యతరగతి రైతు కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపింది.
14 లక్షల మంది రైతులకు నేరుగా ప్రయోజనం
ప్రభుత్వ తాజా ప్రకటన ప్రకారం.. గత ఏడాది మే 1, 2025 ఫిబ్రవరి 28, 2026 మధ్య కాలంలో సహకార బ్యాంకుల పంట రుణాలు తీసుకున్న వారందరికీ ఈ పథకం నుండి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14,22,555 మంది రైతులు ఈ రుణమాఫీ వల్ల రుణ విముక్తులు కానున్నారు. దీనికోసం తమిళనాడు ప్రభుత్వంపై రూ. 2,044.46 కోట్లు అదనపు ఆర్థిక భారం పడనుంది. ఆర్థిక ఇబ్బందుల్లో, రైతుల ప్రయోజనాలే ముఖ్యమని సీఎం విజయ్ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు.
అల్ప ఆదాయ రైతులకు 100 శాతం మాఫీ
ఈ పథకంలో చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. రూ. 50,000 లోపు రుణం ఉన్న అల్ప ఆదాయ రైతులకు వంద శాతం రుణమాఫీని ప్రకటించింది. అంటే వారి అప్పు మొత్తం పూర్తిగా రద్దు. ఇతర రైతులకు కూడా అదే స్థాయిలో 50 శాతం వరకు రుణమాఫీ వర్తించనుంది. రుణ మొత్తం పెరిగే కొద్దీ ప్రభుత్వం ఒక నిర్దేశిత మాఫీ చేస్తూ పట్టికను విడుదల చేసింది. అదనంగా లక్ష రూపాయలకు పైగా రుణం ఉన్నవారికి కూడా రూ. 5,000 వరకు రాయితీ కల్పించారు.
సాగు రంగానికి సరికొత్త ఊతం
పంట రుణాల మాఫీ ద్వారా రైతులకు కొత్తగా రుణాలు పొందే అవకాశం కలుగుతుందని, ఇది రాబోయే సాగు సీజన్‌కు ఎంతో మేలు చేస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేవలం అప్పులు రద్దు చేయడమే కాకుండా, వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా, రాబోయే 45 నుండి 60 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
సహకార బ్యాంకుల ద్వారా రూ.50,000/- వరకు పంటలు పండించిన రైతులకు పూర్తిగా పంటకు తగ్గింపు మాన్పుమికు తమిళనాడు ముఖ్యమంత్రి తిరు. జోసప్ విజయ్ వారి ప్రకటన#సీఎం జోసెఫ్ విజయ్ pic.twitter.com/xzTD98CwWi
— CMOTamilNadu (@CMOTamilnadu) మే 25, 2026
విజయ్ నిర్ణయంపై హర్షాతిరేకాలు
సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై తమిళనాడు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద రైతులకు ఈ పథకం ఒక వరమని అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే రైతుల పక్షపాతిగా విజయ్ గుర్తింపు పొందాలని చూస్తున్నట్లు ఈ పథకం ద్వారా స్పష్టమవుతోంది. ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో టీవీకే (TVK) పార్టీకి మరింత మైలేజీని అందిస్తుంది.
ఇంకా చదవండి

