నరేంద్ర మోడీ మెలోడీ చాక్లెట్స్: అప్పట్లో నరేంద్ర మోడీ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కి వెళ్లారు. విహారయాత్రలకు విదేశాలకు వెళ్లకూడదని.. మనదేశంలో ఉన్న ఇటువంటి ప్రాంతాలను సందర్శించాలని.. అప్పుడు పర్యాటకంగా దేశానికి ఆదాయం లభిస్తుందని.. స్థానికంగా ఉన్న వారికి ఉపాధి కలుగుతుందని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ఆ మాట చెప్పడమే ఆలస్యం.. ఒక్కసారిగా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కు పర్యాటకులు పెరిగిపోయారు. ఇదే సమయంలో మాల్దీవులు వెళ్లే పర్యటకుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. చివరికి ఆ దేశంలో ఆర్థికంగా సమస్యలు, రాజకీయంగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. చివరికి మాల్దీవులు ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు నరేంద్ర మోడీ మరో సంచలనానికి నాంది పలికారు. ఇటలీలో ప్రధాని నరేంద్ర మోడీ.. ఆ దేశ జార్జియా మెలోని కి అపురూపమైన కానుక ఇచ్చారు. ఆ కానుక పేరు మెలోడీ చాక్లెట్లు. దీంతో మెలోడీ చాక్లెట్లు మీడియాలో.. సోషల్ మీడియాలో విపరీతమైన సర్కులేషన్ ఉంది. మేలోని, మోడీ కలిసి మెలోడీ చాక్లెట్లను ఇచ్చుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చారు. దీంతో మెలోడీ బ్రాండ్ విలువ పెరిగింది.
సాధారణంగా మెలోడీ చాక్లెట్లను పార్లే కంపెనీ తయారుచేస్తోందని అందరూ అనుకుంటున్నారు. ఈ చాక్లెట్లకు పార్లే కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. పైగా ఈ కంపెనీ స్టాక్ మార్కెట్ మెలోడీ చాక్లెట్లను తయారుచేసే పార్లే ప్రొడక్ట్స్ లిస్ట్ అవలేదు. మోడీ స్వయంగా మేలోనికి మెలోడీ చాక్లెట్లు ఇవ్వడంతో ఒక్కసారిగా ఆ బ్రాండ్ విలువ పెరిగిపోయింది. అయితే చాలామంది పార్లే ఇండస్ట్రీస్ మెలోడీ చాక్లెట్ తయారు చేస్తోందని అనుకున్నారు. కానీ ఆ సంస్థ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కార్యకలాపాలు సాగుతోంది. ఈ కంపెనీ బిఎస్ఈ లో జాబితా అయింది. ఇటీవల పునరుత్పాదక విభాగం కూడా ఈ కంపెనీ అడుగుపెట్టింది. వరుసగా రెండు రోజులపాటు కంపెనీ షేర్లు అప్పర్ అందుకున్నాయి. అయితే ఈ కంపెనీ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. స్టాక్స్ సాధారణంగా ఒడిదుడుకులకు కనిపిస్తున్నాయి.. అయితే ఈ సంస్థ షేర్ ముఖ విలువ గత మూడు నెలల్లో 35% తగ్గింది. ఇక ఏడాది ప్రారంభంలో అయితే 41% తగ్గిపోయింది.
నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన తర్వాత ఈ కంపెనీ షేర్ విలువ పెరిగిపోయింది. అయితే ప్రస్తుతంగా నష్టాలు కలవరపెడుతున్న నేపథ్యంలో ఈ కంపెనీ తేరుకుంది. అయితే ఇప్పటికే మీడియాలో అసలు విషయం తెలియడంతో మదుపరులు ఆ నిర్ణయం తీసుకోవద్దని సూచించింది.

