- ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
- నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు
- ఇజ్రాయెల్‌లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ”నేతన్యాహు నేను చెప్పిందే చేస్తారు” అంటూ. ఇప్పుడీ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ”నెతన్యాహు చాలా మంచి వ్యక్తి. నేను కోరుకున్నది ఏదైనా సరే.. ఆయన చేస్తారు. చాలా మంచి మనిషి. నేను ఏం చెప్పినా అదే చేస్తారు. నా మాట వింటారు” అని. అంతేకాకుండా ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు సరైన గౌరవం దక్కడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ”నా అభిప్రాయం ప్రకారం ఇజ్రాయెల్‌లో ఆయనకు సరైన గౌరవం దక్కడం లేదు. ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రజల్లో నాకు 99 శాతం మద్దతు ఉంది. నేను అక్కడ ప్రధాని పదవికి పోటీ చేసినా గెలిచే పరిస్థితి ఉంది.” అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రంప్-నెతన్యాహు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా.. ఇప్పుడు ఈ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
#చూడండి | ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇలా అన్నారు, “అతను నేను ఏమి చేయాలనుకున్నా చేస్తాడు. అతను చాలా మంచి వ్యక్తి. నేను ఏమి చేయాలనుకున్నా అతను చేస్తాడు… అతను ఇజ్రాయెల్‌లో సరిగ్గా వ్యవహరించలేదు, నా అభిప్రాయం ప్రకారం. నేను ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో 99% వద్ద ఉన్నాను. నేను ప్రధాన పదవికి పోటీ చేయగలను… pic.twitter.com/YPnIPe1r6b
– ANI (@ANI) మే 20, 2026

