మన తెలంగాణ/హైదరాబాద్: పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న కేంద్ర మంత్రి తనయుడు బండి భగీరథ్ కి మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు మధ్యంతర బెయిల్‌నిచ్చింది. దీంతో ఆయన శనివారం చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. ఇంజినీరింగ్ పరీక్షలకు హాజరుయ్యేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి భగీరథ్ తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు.
విద్యా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని న్యాయవాదులు చేసిన వాదనలను పరిశీలించిన న్యాయస్థానం ఆయనకుపాటు మధ్యంతర బెయిల్ అందించిన వారం. ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షలు ఉన్నందున పరీక్షలకు హాజరయ్యేందుకు కోర్టు అతనికి తాత్కాలిక బెయిల్ ఈ నెల 26 వరకు అందించింది.
గత నెల 16న పోక్సో కేసులో భగీరథ్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. పేట బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్లో గత నెల 9వ తేదీన కేసు నమోదు చేసిన తర్వాత అరెస్ట్ భయంతో పరారైన నిందితుడు, ముందస్తు బెయిల్, లేదా తరువాత మధ్యంతర బెయిల్ సమర్పించుకుంటూ తన న్యాయవాదుల ద్వారా హై కోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ పిటిషన్‌ను విచారించిన హై కోర్టు వెకేషన్ కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో భగీరథ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా పరీక్షల నిమిత్తం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.

