- నీట్, సీబీఐ పేపర్ లీక్స్ పై మంత్రి నిర్లక్ష్యాన్ని చూస్తారు.
- లాల్ బహదూర్ శాస్త్రిని స్మరించి రాజకీయ నాయకత్వం దిగజారిందని చెప్పారు.
- యువత నిరుద్యోగం, పెరుగుతున్న ధరలపై ప్రభుత్వం జవాబుదారీతనం.
- చిలీ ఉద్యమం స్ఫూర్తితో పోరాటం కొనసాగించి విజయం సాధించాలన్నారు.
ఇందిరా పార్క్ వద్ద బొద్దింక జనతా పార్టీ నిరసన | హైదరాబాద్: దేశవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా నీట్, సీబీఐ లాంటి ఎగ్జామ్ పేపర్ లీక్స్ జరుగుతుంటే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడున్నారో కూడా తెలియడం లేదని విద్యాశాఖ, ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమంలో ప్రొఫెసర్ పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ.. గతంలో ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే బాధ్యత వహించి అప్పటి మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారని, అలాంటి మహానేత నుంచి ధర్మేంద్ర ప్రధాన్ వరకు రాజకీయాలు దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లిగడ్డల ధరలు పెరిగాయని అడిగితే నేను ఉల్లిగడ్డలు తిననని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారని గుర్తుచేశారు.
రాజకీయ నాయకులు ఎలా మారిపోయారు.. ప్రొఫెసర్ పిట్టకథ
యమధర్మరాజు ఓ భారత రాజకీయ నాయకుడు 40 ఏళ్ల కింద చనిపోయి నరకానికి వెళితే యముడు ఆయనకు పూలమాలవేసి స్వాగతం పలికి ఇంద్రుడి వద్దకు తీసుకెళ్లారు. పరిచయం చేస్తూ భారత్‌కు చెందిన గొప్ప నేత చెప్పి అప్పగించారు. 20 ఏళ్ల కింద మరో లీడర్ చనిపోయి వెళితే బయటకొచ్చి యముడు అటువెళ్లు స్వర్గం వస్తుంది అక్కడికి వెళ్లి ఇంద్రుడికి చెప్పండి అన్నారట. ఈ మధ్య మరో రాజకీయ నేత చనిపోతే యముడు సింహాసనం మీద నుంచి లేవకుండా.. అలా నేరుగా వెళ్తే స్వర్గం వస్తుందని చెబుతారు. ఇది చూసి పోయిన చిత్రగుప్తుడు గతంలో మీరు ఆశ్చర్య ఇంద్రుడి వద్దకు తీసుకెళ్లారు. తరువాత కాలంలో బయటకు వచ్చి అడ్రస్ చెప్పారు. ఇప్పుడు సీటు నుంచి లేవలేదని యముడిని అడిగారట. నేను లేస్తే ఆ రాజకీయ నాయకుడు నా సింహాసనం మీద కూర్చుంటారు అని నవ్వుతూ యముడు చెప్పారంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ పిట్ట కథ చెప్పగానే యువత గట్టిగా చప్పట్లు కొట్టారు.
చిలీలో జరిగిన ఉద్యమాన్ని గుర్తుచేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని సామాన్యుడు అడిగితే ఏడాదిపాటు బంగారం కొనకూడదని దేశ ప్రజలకు ప్రధాని మోదీ ప్రభుత్వం సూచించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సోనమ్ వాంగ్‌చుక్ విద్యాశాఖ మంత్రి అవ్వరు అని సెటైర్లు వేశారు. ఇలా రాజీనామా చేస్తే ప్రజలకు జవాబుదారీతనం, పారదర్శకత వస్తుంది. చిలీ అనే లాటిన్ అమెరికా దేశంలో 30 పైసల మెట్రో ఛార్జీలు పెంచితే 15 నుంచి 18 ఏళ్ల పిల్లలు ప్రారంభించిన పోరాటం అక్కడ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు జరిగింది. సోషల్ మీడియాను, రాజకీయ వ్యవస్థల్ని మీ చేతుల్లో ఉంచుకుంటారు కానీ జనాలు ఆగ్రహిస్తే దేశంలో కాక్రోచ్ ఉద్యమరూపం దాల్చి ఉంది. అంతిమ విజయం సాధించే వరకు ఈ పోరాటం కొనసాగించాలని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆకాంక్షించారు.
ఇంత అవినీతి జరిగినా, తప్పిదాలు జరిగినా కనీసం ఏ ఒక్కరూ జవాబుదారీతనం ఉండరా. కనీసం ఉద్యమం తీవ్రతరం జరిగితే కూడా చర్యలు తీసుకోరా. దేశంలో 20 శాతం మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారు. మోదీగారు చెప్పిన 5 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మార్చుతాం. మాకు ఉద్యోగాలివ్వాలని యువత అడుగుతోంది. పరాన్నజీవులుగా బతకాలని మేం అనుకోవడం లేదు. మేం కష్టపడి పనిచేసే కాక్రోచ్‌లం అని చెబుతున్నాం. ఉద్యోగాల గురించి యువత అడిగితే సమాధానం చెప్పే వ్యక్తి లేరు. నిర్బయ నుంచి దిశ లాంటి ఎన్నో అత్యాచార ఘటనలు జరుగుతున్నాయంటే ఆడవాళ్లు అంతరాత్రి ఎందుకు వెళ్లారు, అలాంటి డ్రెస్సులు ఎందుకు వేసుకున్నారని ప్రశ్నిస్తారు.
రాజకీయ వ్యవస్థల్ని, అవినీతిని, నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తే నువ్వు అర్బన్ నక్సలైట్ అంటారు. నువ్వు చైనా, పాక్ ఏజెంట్ అంటారు. దేశద్రోహి అంటారు. ఇలాంటి మాటలు అన్నా మేం పట్టించుకోం. మేం భారతమాత ముద్దుబిడ్డలం, భగత్ సింగ్ తమ్ముళ్లం. అందుకే భారత్ మాతాజీ జై అని గట్టిగా నినదిస్తున్నాం. మేరు కాదు అసలైన దేశభక్తులం మేం. మహాత్మాగాంధీకి 7 ఏళ్ల జైలుశిక్ష విధించిన అనంతరం జడ్జి అడిగితే.. బయటకు వెళ్లాక ఏం చేస్తావని అడిగితే మళ్లీ ఇలాగే పోరాటం చేస్తానన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ స్వయంగా చెప్పారు. కష్టపడి రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. కానీ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చకపోతే ప్రజలే ఈ రాజ్యాంగాన్ని చెరిపివేస్తారని హెచ్చరించారు. ఆన్లైన్లో మొదలైన ఈ ఉద్యమం వీధుల్లోకి వచ్చి నేరుగా పోరాటంగా మారింది. సోషల్ మీడియాతో పాటు బయటకు వచ్చి పోరాటం చేస్తే విజయం సాధ్యమన్నారు.
చిలీ ఉద్యమాన్ని గుర్తుచేసిన ప్రొఫెసర్
చిలీ అనే లాటిన్ అమెరికా దేశంలో 30 పైసల మెట్రో ఛార్జీలు పెంచితే 15 నుంచి 18 ఏళ్ల పిల్లలు ప్రారంభించిన పోరాటం అక్కడ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు జరిగింది. సోషల్ మీడియాను, రాజకీయ వ్యవస్థల్ని మీ చేతుల్లో ఉంచుకుంటారు కానీ జనాలు ఆగ్రహిస్తే దేశంలో కాక్రోచ్ ఉద్యమరూపం దాల్చి ఉంది. అంతిమ విజయం సాధించే వరకు ఈ పోరాటం కొనసాగించాలని ఆకాంక్షించారు.
లీఫ్ హెల్మెట్ ధరించిన వ్యక్తి వైరల్ వీడియో | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!

