బ్లాక్ మనీ కేసులో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి ముంబై హైకోర్టులో భారీఊరట లభించింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్, జరిమానా సహా ఎటువంటి చర్యలు తీసుకోరాదని అధికారులను కోర్టు ఆదేశించింది. బ్లాక్ మనీ చట్టం కింద 814 కోట్లకు పైగా విదేశీ ఆస్తుల విషయంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది.చట్టంలోని కొన్ని రూల్స్ రాజ్యాంగ విరుద్ధమని సవాల్ చేస్తూ అనిల్ అంబానీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన జస్టిస్ బి.పి. కోలబవాలా, ఫిర్దోష్ పూనీవాలాలతో కూడిన ధర్మాసనం.. పిటిషనర్‌పై ప్రాసిక్యూషన్ ,జరిమానతో సహా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని ప్రకటించారు.
బ్లాక్ మనీ చట్టాన్ని సవాలు చేస్తూ ఇలాంటి పిటిషన్లు ఇప్పటికే తమ ముందు పెండింగ్‌లో ఉన్నాయని, వాటితో పాటు అంబానీ పిటిషన్‌ను కూడా విచారిస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఆదేశాలు రావచ్చు.. రిట్ పిటిషన్‌పై విచారణ జరిగి, తుది పరిష్కారం అయ్యేంత వరకు, పిటిషనర్‌పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు అధికారులు ఆదేశించారు.
ఏంటి కేసు..?
రెండు స్విస్ బ్యాంకు ఖాతాలలో ఉన్న రూ. 814 కోట్లకు పైగా విలువైన వెల్లడి చేయని విదేశీ ఆస్తులపై రూ. 420 కోట్లకు పైగా పన్నులు ఎగవేసినట్లు అనిల్ అంబానీపై ఆరోపణలు ఉన్నాయి. 2022లో ఈ కేసులో అంబానీకి ఆదాయ పన్ను శాఖ నోటీసు జారీ చేసింది.బహమాస్ కు చెందిన డైమండ్ ట్రస్ట్, బ్రిటీష్ వర్జిన్ ఐర్లాండ్స్ లో నార్టార్న్ అట్లాంటిక్ ఆగస్టు ట్రేడింగ్ అన్ లిమిటెడ్ సంస్థల్లో అంబానీ ఆస్తులు గుర్తించిన ఇన్ కంటాక్స్ డిపార్టు ట్యాక్స్ ఎగవేసినట్లు ఆరోపించింది. బ్లాక్ మనీ చట్టంలోని సెక్షన్ 50,51 కింద కేసు పెట్టింది. రుజువైతే 10ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
►ఇంకా చదవండి | కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం..? మమత బెనర్జీ పార్టీ ఆన్సర్ ఇదే
అనిల్ అంబానీ వాదన..
బ్లాక్ మనీ చట్టం 2015నుంచి అమలులోకి వచ్చింది. ఆదాయపు పన్ను శాఖ ఆరోపిస్తున్న ఆస్తుల లావాదేవీలు 2006 నుంచి 2011 మధ్య జరిగిన అనిల్ అంబానీ వాదిస్తున్నారు. ఈ చట్టం అమల్లోకి రాకముందు జరిగిన లావాదేవీలకు వర్తింపజేయలేమని కోర్టులో పిటిషన్ వేశారు. అనిల్ అంబానీ లెక్క చెప్పని విదేశీ ఆస్తుల విలువను రూ. 814 కోట్లుగా అంచనా వేసి, సుమారు రూ. 420 కోట్ల పన్నులు ఎగవేశారని అనిల్ అంబానీపై విచారణ సాగుతోంది. మనీ చట్టంపై ఇంతకుముందే ముంబై హైకోర్టులో చాలా పిటిషన్లు దాఖలు కావడంతో అనిల్ అంబానీ దాఖలు చేసిన పిటిషన్ కూడా వాటితో కలిపి విచారిస్తామని కోర్టు ప్రకటించింది. అప్పటివరకు పిటిషనర్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని అధికారులను ఆదేశించారు.

