ఇండియాలో స్ట్రీట్ ఫుడ్ గురించి ప్రస్తావన వస్తే… బంగాళాదుంప గురించి చెప్పకుండా ఉండలేం. ముంబైలో వడా పావ్ అయినా.. ఢిల్లీలో ఆలూ టిక్కీ అయినా.. ఆలూ దే కీరోల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాదాసీదాగా కనిపించే బంగాళాదుంపకు ఏడు వేల ఏళ్ళ చరిత్ర ఉందని.. అసలు మన దేశానికి చెందినదే కాదని తెలుసా..? అవును మనదీ అని మనం ఫీల్ అవుతున్న బంగాళాదుంప మనది కాదు. బంగాళాదుంప 7 వేల ఏళ్ళ చరిత్ర ఏంటి…? మన దేశానికి ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళాదుంప విదేశీ పంట. ఏడు వేల ఏళ్ళ క్రితం పేరులోని ఆండీస్ పర్వతాలలో పుట్టింది బంగాళాదుంప. బంగాళాదుంప కథ దక్షిణ పెరూలోని ఎత్తైన పర్వతాలలో మొదలయ్యింది. అక్కడి ప్రజలు వేల ఏళ్ళ క్రితం అడవి బంగాళాదుంపలను పండించడం. 1430 నుండి బంగాళాదుంప సాగులో ఉన్నట్లు ఉంది.
1532లో స్పెయిన్ నుండి యూరప్ ఖండానికి చేరుకుంది బంగాళదుంప. యూరప్ వాసులు దీనిని అనుమానంగా చూసినప్పటికీ… దీనికున్న పోషక విలువలు, ఏ సీజన్లో అయినా పండించే అవకాశం కారణంగా యూరప్‌లో కూడా సాగు చేయడం మొదలు పెట్టారు. కాలక్రమంలో యూరప్‌లో కూడా బంగాళాదుంప ప్రధాన ఆహారంగా మారింది.
గోవా మీదుగా భారతదేశానికి:
17వ శతాబ్దంలో పోర్చుగీస్ బంగాళాదుంపను గోవా మీదుగా భారతదేశానికి తీసుకువచ్చారు. ఆ తర్వాత ఆలూ గుణగణాలు తెలుసుకున్న బ్రిటిష్ ఉత్తర భారతదేశంలోని మైదానం, కొండ ప్రాంతాల రైతులను ఆలూ సాగు చేసే వారు ప్రోత్సహించారు. ఆ తర్వాత ఆలూ భారతదేశంలోని అన్ని గ్రామాలు, పట్టణాలకు వ్యాపించింది.
స్ట్రీట్ ఫుడ్ కి ఆలూ కింగ్:
ఇండియాలో స్ట్రీట్ ఫుడ్ లో బంగాళాదుంప కీలకంగా మారింది. బంగాళాదుంపకు ఉన్న మసాలాలు బాగా పీల్చుకునే గుణం కారణంగా పానీ పూరి, ఆలూ చాట్ వంటి ఐటమ్స్‌లో సరైన జోడింపుగా మారింది. ఏరియాను బట్టి ఒక్కో స్టైల్లో ఆలూ స్ట్రీట్ ఫుడ్‌లో కీలక పాత్ర పోషిస్తోంది.
టేస్ట్ తో పాటు ఆరోగ్యం:
ఆలూ మంచి టేస్ట్ ఇవ్వడమే కాకుండా పోషకాలు అందించడంలో కూడా రిచ్ అనే చెప్పాలి. కార్బోహైడ్రేట్లు మనకు రోజువారీ పనులు చేయడానికి శక్తిని ఇస్తాయి. ఇది పీచుపదార్థం, విటమిన్ సి , విటమిన్ బి6, పొటాషియంలకు కూడా ఒక పుష్కలంగా ఉంటాయి.
బంగాళాదుంపను శనగలు, పెరుగు, వివిధ రకాల చట్నీలతో కలిపి స్ట్రీట్ ఫుడ్ లాగా తీసుకుంటే అది రుచిని మాత్రమే కాకుండా అదనపు ప్రోటీన్, ప్రోబయోటిక్స్, విటమిన్లను కూడా అందిస్తుంది.

