హైదరాబాద్ మూవీ లవర్స్ దశాబ్ద కాలంగా ఆ కల నెరవేరబోతోంది. నగరంలో మళ్లీ ఐమాక్స్ (IMAX) స్క్రీన్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఐకానిక్ సుదర్శన్ 70M థియేటర్లోని రూపురేఖలు మారబోతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏషియన్ సినిమాలు భాగస్వామ్యంలో ఉన్న ‘AMB సినిమాస్’ బ్రాండ్ కింద ఈ సరికొత్త ‘AMB క్లాసిక్’ మల్టీప్లెక్స్ రూపుదిద్దుకుంటోంది.
2వ అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్..
లేటెస్ట్ సమాచారం ప్రకారం.. సుదర్శన్ 70MM థియేటర్ ఇప్పుడు అత్యాధునిక ‘IMAX with Laser’ ఆడిటోరియంగా మారబోతోంది. ఇది భారతదేశంలోనే రెండో అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్. 4K ప్రొజెక్షన్, అదిరిపోయే బ్రైట్నెస్, క్రిస్టల్ క్లియర్ విజువల్స్, మైండ్ బ్లోయింగ్ సౌండ్ సిస్టమ్‌తో ఈ స్క్రీన్ ప్రేక్షకులకు నెక్స్ట్ లెవెల్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వనుందని AMB సినిమా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
‘వారణాసి’ లూప్..
ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకడానికి మరో ముఖ్య కారణం. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న అడ్వెంచరస్ ఫిల్మ్ ‘వారణాసి’ (వారణాసి). ఈ సినిమా పూర్తి స్థాయిలో ఐమాక్స్ సర్టిఫైడ్ కెమెరాలతో షూట్ చేస్తున్నారు. ఈ విజువల్ వండర్‌ను హైదరాబాద్ ఆడియన్స్ తమ సొంత నగరంలోనే ఐమాక్స్ స్క్రీన్‌పై ఎంజాయ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
హిస్టారికల్ కంబ్యాక్..
ఒకప్పుడు ప్రసాద్ ఐమాక్స్ (ప్రసాద్ ఐమాక్స్) ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్లలో ఒకటిగా హైదరాబాద్‌కు గర్వకారణంగా ఉండేది. కానీ సాంకేతిక కారణాల వల్ల 2015లో అక్కడ ఐమాక్స్ ఫార్మాట్ నిలిచిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు, అంటే 2026 చివరి నాటికి కొత్త ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఐమాక్స్ స్క్రీన్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
IMAX చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జియోవన్నీ డోల్చి మాట్లాడుతూ.. హైదరాబాద్ సినిమా ప్రేక్షకులు ఐమాక్స్ కోసం పక్క రాష్ట్రాలకు ప్రయాణం చేయడం చూసి ఆశ్చర్యపోయాను. అందుకే ఇక్కడ బెస్ట్పీరియన్స్ ఇవ్వడానికి ఏషియన్ సినిమాలతో చేతులు కలిపాం అని వివరించారు. ఏషియన్ సునీల్ నారంగ్, భరత్ నారంగ్ కూడా ఈ ప్రాజెక్ట్ తెలుగు సినిమా స్థాయిని పెంచుతుందని ధీమా వ్యక్తం చేశారు.
గరిష్ట చిత్రం
గరిష్ట ధ్వని
గరిష్ట ఇమ్మర్షన్
పరిచయం చేస్తూ,
IMAX 🔥త్వరలో AMB క్లాసిక్ విక్టరీ, హైదరాబాద్ 🌟లో మాత్రమే@IMAX @సురేష్ ప్రొడన్స్#IMAX #AMBCక్లాసిక్ విక్టరీతో గృహప్రవేశం pic.twitter.com/OcuQfibz7N
— AMB సినిమాస్ (@amb_cinemas) జూన్ 1, 2026

