Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- కోపం, ఒత్తిడి వల్ల మీ అందం తగ్గుతోందా ? మీకు తెలియకుండానే మీ అందాన్ని తినేస్తున్న 4 నెగెటివ్ ఎమోషన్స్ ఇవే !
- లారీలు ఢీకొని అగ్నిప్రమాదం.. నలుగురు మృతి
- సీఎం విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారీ కుట్ర.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.15 కోట్లు ఆఫర్ ! నలుగురు అరెస్టు
- రౌండ్ ఆఫ్ 16లో చేరిన మెక్సికో.. 40 ఏళ్ల తర్వాత అభిమానుల గ్రాండ్ సెలబ్రేషన్స్ వైరల్!
- ఉద్యోగాలు ఇచ్చేవారుగా యువత ఎదగాలి: మంత్రి లోకేశ్
- వైభవ్ సూరయ్వంశీ : సచిన్ టెండుల్కర్ రికార్డు కోసమే వైభవ్‌ను ఆపుతున్నారా? ముంబై లాబీ బలంగా పనిచేస్తోందా..! | వైభవ్ సూర్యవంశీ భారత అరంగేట్రం ఆలస్యం ఐర్లాండ్ వైట్‌వాష్ తర్వాత ముంబై లాబీ చర్చకు దారితీసింది.
- జ్యోతిష్యం: కుంభరాశి వారికి జులైలో అదృష్టం వరిస్తుంది.. ఈ పరిహారాలు చేయండి..!
- Bulli Raju: నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న బుల్లిరాజు..రోజుకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..
Author: swathi.gnec@gmail.com
మే 24 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా బందుకు అసోసియేషన్ పిలుపునిచ్చింది. కోవిడ్ సమయంలో వచ్చినప్పుడు అడ్డంగా పెట్టుకుని అక్రమ దందా జరుగుతుందని ఆరోపిస్తుంది. నకిలీ మందులతో పాటు… ఆన్‌లైన్ బిజినెస్‌లో నకిలీ మందులతో పాటు ప్రమాదకరమైన మందులు సరఫరా అవుతున్నాయని అసోసియేషన్.. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఆన్‌లైన్ సేవలకు ఫుల్ స్టాప్ పెట్టాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 24వ తేదీన మెడికల్ ఇన్‌స్టాల్‌ను బంద్ చేయాలని నిర్ణయించింది.
పోక్సో కేసులో బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయాడు. ఈ కీలక కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రకటన చేశారు. చట్టంపై ఉన్న గౌరవంతోనే తన కొడుకు భగీరథ్ ను పోలీసులకు అప్పగించానని చెప్పారు. బండి సంజయ్ ఏమన్నారంటే.. నిజానికి ఫిర్యాదు వచ్చిన వెంటనే అతడిని స్టేషన్‌లో అప్పగిద్దామనే అనుకున్నాను. కానీ మా అబ్బాయి తను ఏ తప్పూ చేయలేదని పదే చెప్పాడు. లాయర్లను సంప్రదించి మా దగ్గర ఉన్న ఆధారాలు వారి ముందుంచాడు. ఆ ఆధారాలు చూసిన లాయర్లు… కేసు ఖచ్చితంగా కొట్టేస్తారని, బెయిల్ వస్తుందని చెప్పారు. ఈ రోజు కూడా బెయిల్ వస్తుందనే లాయర్లు ధీమా వ్యక్తం చేశారు. ఆ నమ్మకంతోనే కొంత జాప్యం జరిగింది తప్ప చట్టం నుండి తప్పించుకోవాలనే ఉద్దేశ్యం మాకు లేదు. అయితే ఇంకా ఆలస్యం చేయడం సరికాదనే ఉద్దేశ్యంతోనే, సోమవారం కోర్టుకు అనుమతి వచ్చే అవకాశం… శనివారమే(మే 16) మా అబ్బాయిని తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాను.నేను…
విశాలాంధ్ర-డుంబ్రిగుడ : డుంబ్రిగుడ వన సంరక్షణ సమితి చైర్ పర్సన్ గా శెట్టి. మల్లేశ్వర రావు, వైస్ చైర్మన్ గా ఎం. మినీ ని డుంబ్రిగూడ గ్రామస్తులు శనివారం సామాజిక భవనంలో తెలుగుదేశం పార్టీ కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ టి సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ టిఎన్టియుసి అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎం. స్వామి, ఎంపీటీసీ సింహాద్రి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కృష్ణం నాయుడు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఉద్దంగి, రేణుక, వెంకటరాజు ఆధ్వర్యంలో ఏకీభవంగా కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన విఎస్ ఎస్ ఛైర్పర్సన్ శెట్టి మల్లేశ్వరరావు మాట్లాడుతూ. వన సంరక్షణ మన అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా వనాన్ని ఉంచాలని చెప్పారు. వన సంరక్షణ కమిటీ చైర్పర్సన్ గా నా శక్తికి మించి ఎటువంటి సమస్య ఉన్న కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో…
వైసీపీ అధినేత జగన్.. తన సోషల్ మీడియా ఖాతాలో ప్రభుత్వ పనితీరు.. అప్పుల లెక్కలు.. పథకాలకు వెచ్చిస్తున్న సొమ్ములు.. ఇలా అనేక విషయాలను ప్రస్తావించారు. అదేసమయంలో ప్రభుత్వ పనితీరుపై ఇటీవల కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్(కాగ్) ఇచ్చిన నివేదికలోని అంశాలనుకూడా జగన్ ప్రస్తావించారు. ప్రభుత్వం చెబుతోంది దానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికీ సంబంధం లేదని విమర్శించారు. అదేసమయంలో సొమ్ములు ఏమవుతున్నాయో కూడా తెలియడం లేదన్నారు. ఇలా.. జగన్ పలు అంశాలపై వివరణతోపాటు.. విశ్లేషణ కూడా చేశారు. అదేసమయంలో తన పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు చేసిన మేళ్లను మరోసారి వివరించారు. తమ హయంలో రైతులకు.. మహిళలకు, బీసీ సామాజిక వర్గాలకు ఎలాంటి మేలు చేశామన్నది ఆయన చెప్పారు. అయితే.. ఇంత చేసినా.. ఎంత చెప్పినా.. జగన్ మాట పెద్దగా జనాలు పట్టించుకో కపోవడం గమనార్హం. ఎక్స్‌లోను.. తర్వాత సామాజిక మాధ్యమాల్లోనూ జగన్ చేసిన పోస్టుకు పెద్దగా నెటిజన్ల నుంచి ఎలాంటి కామెంట్లు రాలేదు.…
తమిళ నటుడు రవి మోహన్ తన కెరీర్‌లో అనేక విజయవంతమైన చిత్రాలలో భాగమయ్యాడు. అతను ఇటీవల తన భార్య ఆర్తితో విడాకులు తీసుకున్న వార్తల్లో నిలిచాడు. నటుడు గాయని కెనీషాతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. నటుడు రవి మోహన్‌తో విడిపోయానని గాయని మరియు చికిత్సకుడు గత రాత్రి పోస్ట్ చేశారు. తమిళ నటుడు ఈరోజు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యి సంచలన ప్రకటనలు చేశాడు. విడాకులు ఇచ్చేంత వరకు ఏ సినిమాలో నటించనని ప్రకటించాడు. అతని సంచలన ఆరోపణలు ఇవే: అందరూ నన్ను సాఫ్ట్ పర్సన్ అని అనుకుంటారు. నేను అలాగే ఉన్నాను, కానీ ఇకపై కాదు. కోపాన్ని భరించడం చాలా కష్టం. నా సహనాన్ని పరీక్షిస్తున్న వ్యక్తులు ఉన్నారు. నాకు విడాకులు ఇచ్చేంత వరకు ఏ సినిమాలో నటించను. నా కొడుకులను కలవనివ్వడం లేదు. నా కొడుకులకు అంగరక్షకులు సహాయం చేస్తున్నారు. పెళ్లి చేసుకోవద్దని నా తల్లిదండ్రులు నన్ను హెచ్చరించారు.…
ప్రచురించబడిన తేదీ :మే 16, 2026 , రాత్రి 9:09 నెదర్లాండ్స్‌లో కొనసాగుతున్న మోడీ పర్యటన నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం యూఏఈలో కొనసాగుతోంది.. శనివారం నెదర్లాండ్స్‌లో కొనసాగుతోంది. ముందుగా భారతీయ సమాజాన్ని కలిసి కీలక ప్రసంగం చేశారు. అనంతరం నెదర్లాండ్స్ ప్రభుత్వ పెద్దలతో సమావేశమై కీలక చర్చలు జరిపారు. ఇక పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ రాజు విలెమ్-అలెగ్జాండర్, రాణి మాక్సిమాను రాజభవనంలో కలిశారు. ఈ సందర్భంగా భారత్-నెదర్లాండ్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, భవిష్యత్ భాగస్వామ్యంపై కీలక చర్చలు జరిగాయి. ఈ భేటీ అనంతరం ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ”రాయల్ ప్యాలెస్‌లో రాజు విలెమ్-అలెగ్జాండర్, రాణి మాక్సిమాలను కలిశాను. సాంకేతికత, ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధి, వాణిజ్యం, జల వనరులు వంటి కీలక రంగాల్లో భారత్-నెదర్లాండ్స్ స్నేహాన్ని మరింత బలోపేతం చేసే…
సెలబ్రెటీలు కనిపిస్తే చాలు.. మీడియాలో కొందరు అత్యుత్సాహానికి గురై చెత్త ప్రశ్నలు వేస్తారు. ఇందుకు ఏ ఇండస్ట్రీ జర్నలిస్టులూ మినహాయింపు కాదు. సినిమాల గురించి లోతుగా ప్రశ్నలు అడిగే పరిజ్ఞానం లేక, సరైన కసరత్తు చేయకపోవడం వల్ల ప్రెస్ మీట్లలో సినిమాలతో సంబంధం లేని వ్యక్తిగత విషయాల గురించి అర్థరహితమైన ప్రశ్నలు వేసే జర్నలిస్టులు మన దగ్గరా చాలామందే ఉన్నారు. సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ జరిగినా కూడా అవేమీ పట్టనట్లు అవే చెత్త ప్రశ్నలు వేసి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. తమిళంలో కూడా ఇలా పేలవమైన ప్రశ్నలతో కొందరు జర్నలిస్టులు తరచుగా సోషల్ మీడియాకు దొరికిపోతుంటారు. ఆ మధ్య గౌరి కిషన్ అనే యువ’ నటి బరువు గురించి దారుణమైన ప్రశ్నలు వేసి ఒక జర్నలిస్టు ఎంతగా విమర్శలు ఎదుర్కన్నాడో. ఇప్పుడు మరో సినీ విలేకరి.. మాళవిక మోహనన్‌ను అడిగిన ప్రశ్నతో విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. తాజాగా తమిళనాట మాళవిక…
ధురంధర్ 2 OTT: బాక్స్ ఆఫీస్ వద్ద ‘ధురంధర్’ సిరీస్ సృష్టించిన ప్రభంజనం అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఎలాంటి అంచనాలు లేకుండా, చాలా సాధారణంగా విడుదలైన ‘ధురంధర్’ చిత్రం, సినిమాటిక్ అనుభూతికి పరాకాష్ట లాంటిది. ఒక సినిమాని ఎంత అద్భుతంగా తియ్యాలి , ఎంత ఎంగేజింగ్ గా తియ్యాలి , స్క్రీన్ ప్లే తో ఎలా ప్రేక్షకులను కట్టిపారేయొచ్చు వంటి విభాగాల్లో , ఫిలిం స్కూల్స్ కోచింగ్ కోసం ఈ విద్యార్థులకు చూపించవచ్చు. అలాంటి వెండితెర అద్భుతం ఇది. అందుకే ఆడియన్స్ ఈ నెత్తిన పెట్టుకొని ఆదరించారు కేవలం హిందీ వెర్షన్ తోనే 1380 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ధురంధర్ 2’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 1870 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ ఈ చిత్రం థియేటర్లలో రన్ అవుతూనే ఉంది. అయితే…
National Dengue Day:డెంగ్యూ కేవలం జ్వరం అనుకుంటున్నారా..నిర్క్ష్యం చేస్తే చాలా ప్రమాదం..డాక్టర్ల సీరియస్ వార్నింగ్ చిత్రం యొక్క శీర్షిక. డెంగ్యూ.. ఇది కేవలం మాత్రమే.. అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని జ్వరం ఉంటుంది. కొంచెం విశ్రాంతి తీసుకుని ఓ పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది. అయితే డెంగ్యూను నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం అంటున్నారు డాక్టర్లు. కాలేయ సమస్యలు, రక్తస్రావ సమస్యలు,ప్లేట్‌లెట్ కౌంట్ పడిపోవడం, కొన్ని సార్లు షాక్ సిండ్రోమ్‌కు కూడా కారణం కావచ్చు.ఈ వ్యాధి ముఖ్యంగా వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు,అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రమాదకరంగా మారవచ్చు. మే 16, 2026 జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా డెంగ్యూ బారిన పడకుండా ఎలా కాపాడుకోవాలి..డెంగ్యూ సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం.. డెంగ్యూ లక్షణాలు.. డెంగ్యూ లక్షణాలను అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించడం మంచిది. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కీళ్ల,…
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ సీపీఐ జిల్లా కమిటీ పిలుపు మేరకు శనివారం బస్టాండ్ ఆవరణలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్ పై 3.29, డీజిల్ పై 3.14 రూపాయలు పెంచి సామాన్యులపై మోయలేని భారం మోపిందని తెలిపారు. ఎన్నికల ముందు ఓక మాట, ఎన్నికలు ముగిసిన తర్వాత ఓక మాట మాట్లాడం ప్రధాని నరేంద్ర మోడీకే చెల్లిందని. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు చందంగా ప్రజల పరిస్థితి ఏర్పడింది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున…
